మీ పొలిటిషియన్స్ ని ప్రశ్నించండి..సహనం కోల్పోయిన రేణు దేశాయ్
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా పలువురు సినీ తారలు తమకు చేతనైనంత సాయం చేస్తూ కష్టాల్లో ఉన్నవారికి తమ దగ్గరకు వస్తున్న వారి సమస్యలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. మరి వాయారీలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఒకరు. రేణు దేశాయ్ తన ఇన్స్టా ద్వారా అవసరం ఉన్న మేర తన సాయ శక్తుల గత కొన్ని రోజులు నుంచి సాయం అందించడం మొదలు పెట్టారు.
తనని కూడా అర్ధం చేసుకోవాలని సూచించారు. మరి తాను షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో మెసేజ్ హైలైట్ చేసారు. అందులో ఏముందంటే తనని ప్రశ్నిస్తూ మీరు సాయం చేస్తా అన్నారు ఎక్కడ మీ సాయం ఉన్నవాళ్లనే పట్టించుకుంటరా అంటూ ఓ నెటిజన్ కొన్ని మెసేజెస్ పెట్టగా దానికి ఇలాటి ప్రశ్నలు అడగడానికి నేనేమన్నా పొలిటీషియన్ నా? అని ప్రశ్నించారు.
ఇలాంటి ప్రశ్నలు మీరుఇ ఓటు వేసి గెలిపించుకున్న రాజకీయ నాయకులను అడగండి అని కాస్త సహనం కోల్పోయారు. అలాగే ఇలాంటి విషయాల్లో కూడా డిమాండ్ చేయడం బాధ కలిగించేలా మాట్లాడ్డం తనలోని స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని తెలిపారు. దీనిని బట్టి ఫాలోవర్స్ కూడా సహనంగా ప్రవర్తిస్తే బాగుంటుంది.