మన అపార్ట్‌మెంట్ లో వుంటున్న అన్ని కుటుంబాల వారికి ముఖ్య విజ్ఞప్తి
మన పిడుగురాళ్ళ పట్టణంలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మనందరి ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం మన అపార్ట్‌మెంట్(విఘ్నేశ్వర రెసిడెన్సీA,B,C) బ్లాక్ లలో నివశిస్తున్న అన్ని కుటుంబాల వారికి ఈ నెల 7.5.2022 అనగా శనివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ శిబిరం మన అపార్టుమెంట్(విఘ్నేశ్వర రెసిడెన్సీ బ్లాక్ - A ) లోని కాన్ఫరెన్స్ హాలు నందు జరుగును. ఈ శిబిరానికి హాజరైన వారందరికీ ఉచితంగా బీపీ మరియు షుగర్(తినక ముందు మరియు తిన్న తరువాత) పరీక్షలు చేస్తారు. అలాగే అవసరమైన వారికి ఈసీజీ పరీక్ష కూడా ఉచితంగానే చేస్తారు. అలాగే అవసరమైన వారికి ఉచిత హెల్త్ కూపన్ కూడా ఇవ్వబడుతుంది.
కనుక మన అపార్ట్‌మెంట్ లోని అన్ని కుటుంబాల వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా కోరుచున్నాము.