ముఖ్యమంత్రి ‘జగన్‌’ కు జ్ఞాపికను బహుకరించిన ‘కపలవాయి విజయ్‌కుమార్‌’ 

ముఖ్యమంత్రి ‘జగన్‌’ కు జ్ఞాపికను బహుకరించిన ‘కపలవాయి విజయ్‌కుమార్‌’ 

నరసరావుపేట (ఇండియాజ్యోతి) : ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డికి స్ధానిక వైసీపీ నాయకులు, రాష్ట్ర గోల్డ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కపలవాయి విజయ్‌కుమార్‌ చిరకాలం గుర్తిండిపోయే విధంగా ఓ జ్ఞాపికను బహుకరించారు. గురువారం పట్టణంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఇక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో విజయ్‌కుమార్‌ కూడా వున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్‌ వద్ద  ముఖ్యమంత్రికి విజయ్‌కుమార్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జ్ఞాపికను బహుకరించారు. జ్ఞాపికను తీసుకున్న ముఖ్యమంత్రి దానిని పరిశీలించి చూసి, చాలా బాగుందని విజయ్‌కుమార్‌ ని అభినందించారు.  

What's Your Reaction?

like
1
dislike
0
love
1
funny
0
angry
0
sad
0
wow
0