ఫ్రీగా 10 లక్షలు ఇస్తున్న RBI.. మరో రెండు రోజులే గడువు..
భారతీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థల కార్యకలాపాలను నియంత్రిస్తుంటుంది. కొన్ని ప్రత్యేక రోజుల సందర్భంగా పలు పోటీలు నిర్వహించి భారీగా నగదు బహుమతులు ముట్టచెబుతోంది. ఇదే మాదిరిగా ఇప్పుడు 10 లక్షలు గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే దీనికి కేవలం విద్యార్థులు మాత్రమే అర్హులు అని గుర్తించాల్సి ఉంటుంది.
అన్ని స్ట్రీమ్‌లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్న కళాశాల విద్యార్థుల భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా క్విజ్ పోటీని నిర్వహించనుంది. RBI 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 20 నుంచి దీనికోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ గడువు సెప్టెంబర్ 17తో ముగియనుంది. అప్పటిలోగా విద్యార్థులు అప్లికేషన్ విండోను మూసివేస్తుంది.
అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ సమాచారాన్ని తమ సంస్థల్లో తెలియచేయాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) జారీ చేసిన నోటీసులో పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను క్విజ్‌లో పాల్గొని విజయవంతం చేసే విధంగా ప్రోత్సహించాలని కోరింది. క్విజ్‌లో ప్రాథమికంగా చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, వర్తమాన వ్యవహారాలు మొదలైన జనరల్ నాలెడ్జ్‌పై దృష్టి సారిస్తున్నట్లు చెప్పింది. పోటీలో మొదటి విజేతకు 10 లక్షలు అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో ఎంగేజ్‌మెంట్‌ను రూపొందించాలని RBI లక్ష్యంగా పెట్టుకుంది. నోటిఫికేషన్ ప్రకారం క్విజ్ లో నాలుగు దశలు ఉంటాయి. మొదటి స్టేజ్‌లో ఆన్‌లైన్ ద్వారా హిందీ మరియు ఆంగ్లంలో ఆన్‌లైన్ క్విజ్ ఉంటుంది. రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కళాశాలలు ఫేజ్ 2కి వెళతాయి.రెండో దశలో ఎంపిక చేయబడిన కళాశాలలు ఎలిమినేషన్ రౌండ్ తర్వాత పోటీలో పాల్గొంటాయి. ఈ రౌండ్‌లో విజేత జోనల్ రౌండ్‌కు వెళతారు. ఇందులో గెలిచిన పార్టిసిపెంట్లు జాతీయ స్థాయిలో పోటీపడతారు.
క్విజ్‌లో పాల్గొనేవారికి రాష్ట్ర స్థాయి నుంచి బహుమతులు అందిస్తారు. జాతీయ స్థాయిలో పాల్గొనే వారికి మొదటి బహుమతిగా 10 లక్షలు, రెండో ప్రైజ్ కింద 8 లక్షలు మరియు మూడో బహుమతిగా 6 లక్షలు ఇవ్వనున్నారు. RBI వెబ్‌సైట్ ప్రకారం ఆన్‌లైన్ క్విజ్ సెప్టెంబర్ 19 నుండి 21 వరకు నిర్వహించబడుతుంది. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.