పేషెంట్స్ తో డాక్టర్ అసభ్య ప్రవర్తన.. చివరకు
ఒక గైనకాలజిస్ట్ తన దగ్గరికి వివిధ సమస్యలతో వచ్చే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మహిళల ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. దాదాపు ఓ 15 మందితో శృంగారం కూడా చేశాడు. అతని వలన ఇబ్బందులు పడిన ఓ మహిళ ఈ విషయాన్ని ఓ టీవీ ఛానెల్ కి వివరించింది. దీంతో వారు అతన్ని టార్గెట్ చేసి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. వీడియో ఆధారాలతో అతడిని పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే.. ఇటలీకి చెందిన గియోవన్నీ వినియెల్లో అనే 60 ఏళ్ల వ్యక్తి గైనగాలజిస్ట్ గా పని చేసేవాడు. అతడి వద్దకు మహిళలు ప్రెగ్నెన్సీ, గైనిక్, ఇతర సమస్యలతో వచ్చేవారు. పరీక్షలు చేయాలని చెబుతూ ప్రైవేట్ భాగాల్లో టచ్ చేసేవాడు. ఇలా అతడు ట్రీట్ మెంట్ పేరుతో అతడు 15 మంది రోగులతో శృంగారం చేశాడు. అయితే పకడ్బందీగా ఓ లేడీస్ జర్నలిస్టును అతని వద్దకు రోగి మాదిరిగా పంపించారు. ఆ గదిలో సీక్రెట్ గా కెమెరాలను పెట్టించారు. ఇలా ఆమెతో ట్రీట్ మెంట్ గురించి మాట్లాడుతుండగానే అతడు ఆమెను బలవంతం చేశాడు. ఇదంతా సీక్రెట్ కెమెరాలో రికార్డు అయ్యింది. చివరకు ఛానెల్ కు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆమెను రక్షించారు. ఆ ఫుటేజీని ఉన్నతాధికారులకు అందజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అతడి ఉద్యోగం పోయింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.