పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ప్రమాదం..1 మృతి,  17 మందికి గాయాలు  

పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ప్రమాదం..1 మృతి,  17 మందికి గాయాలు  

దాచేపల్లి : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరికేపల్లి గ్రామ సమీపంలో అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై ఆగివున్న లారీని జగన్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను దగ్గరలో వున్నగురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి వస్తోంది. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
0