ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలోనిత్యావసర సరుకుల పంపిణీ..

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలోనిత్యావసర సరుకుల పంపిణీ..

పిడుగురాళ్ళ, సెప్టెంబర్ 9 (ఇండియాజ్యోతి) : పట్టణంలోని ఆర్ అండ్ బి  బంగ్లా నందు బుధవారం ఉదయం ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జూలకంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినవి. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫాష్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చింతా వెంకట రామారావు విచ్చేసి కేక్ కట్ చేసినారు.  అనంతరం మునిసిపాలిటీ కార్మికులకు, నిరు పేదలకు, వృద్దులకు 500 మందికి నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా దాతలు అయిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు , ప్రపంచ ఆర్య వైశ్య మహా సభ కువైట్ ప్రెసిడెంట్ పి.కృష్ణనంజనేయులు ను నాయకులు అభినందించారు. అలాగే  శ్రీ సాయి వృద్దాశ్రమము లోని వృద్దులకు అన్నదానం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో వైసీపీ మండల కన్వీనర్ అల్లు పిచ్చిరెడ్డి,  పట్టణ కోశాధికారి ఆకుల హరిబాబు, కౌన్సిలర్స్ అన్నెం బంగారు రెడ్డి, మాదాల కిరణ్, యస్.సి. నాయకులు  వర్ల రత్నం, డైరెక్టర్ యనమల వెంకటేశ్వర్లు, లఘువరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0