ప్రాణభయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌..! యుద్ధం ఆపే దిశగా పయనం.. ?

ప్రాణభయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌..! యుద్ధం ఆపే దిశగా పయనం.. ?

ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ ను మూడు వైపులా నుంచి చుట్టుముట్టి రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టింది రష్యా సైనం. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని బాంబుల మోత మోగిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ ను స్వాధీన పరుచుకునే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. అయితే ఉక్రెయిన్ కూడా తగ్గేదే లే అంటూ రష్యాపై భీకరంగా పోరాడుతోంది. 

ఇదిలావుంటే, ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రాణభయంలో ఉన్నాడా..? తన నీడను కూడా నమ్మలేకపోతున్నాడా..? ఎప్పటినుంచో ఉన్న రక్షకులను విశ్వసించడం లేదా..? ఆహారం వండి పెట్టే వారిపైనా అనుమానం పెంచుకున్నాడా..? ఇవే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఫిబ్రవరిలో పుతిన్‌ తన పర్సనల్‌ స్టాఫ్‌ను మార్చాడంటూ వచ్చిన కథనం.. వాటికి బలం చేకూరుస్తోంది.
ఫిబ్రవరిలో పుతిన్‌ తన వ్యక్తిగత సిబ్బంది వెయ్యి మందిని ఉద్యోగాల నుంచి తొలగించాడని.. డైలీ బీస్ట్‌ అనే వార్తా సంస్థ కథనం ప్రచురించింది. తనపై విషప్రయోగం జరుగుతుందనే భయంతోనే ఈ పని చేశారని తెలిపింది. యుక్రెయిన్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో పాశ్చాత్య దేశాలు పుతిన్‌ను గట్టిగానే హెచ్చరించాయి. యుక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చాయి. దీంతో అనుమానం పెంచుకున్న పుతిన్‌.. తన పర్సనల్‌ స్టాఫ్‌ను కూడా పక్కనపెట్టాడని సమాచారం.

అమెరికా, నాటో దేశాల హెచ్చరికలతో అప్రమత్తమైన పుతిన్‌.. తనపై విషప్రయోగం జరుగుతుందని అనుమానించాడు. అప్పటి నుంచి తన నీడను కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. యుద్ధానికి వెళ్లేముందే తన స్టాఫ్‌ మొత్తాన్ని మార్చేశాడు రష్యా ప్రెసిడెంట్‌. వెయ్యి మంది స్టాఫ్‌ను రిప్లేస్‌ చేసుకున్నాడు. ఇందులో తన పర్సనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, సెక్రటరీలతో పాటు ఆహారం వండి, వడ్డించే కుక్స్‌ కూడా ఉన్నారు. ఆఖరికి లాండ్రీ టీమ్‌పైనా అనుమానం పెంచుకొని వారిని తొలగించాడు.
రష్యా చరిత్రలో విష ప్రయోగాలు కొత్తేమీ కాదు. పుతిన్‌ ప్రత్యర్థి నావల్నీపై 2020లో విష ప్రయోగం జరిగింది. చికిత్స అనంతరం కోలుకున్నాడు నావల్నీ. ఇది పుతినే చేయించాడని రాజకీయ విమర్శలు వచ్చాయి. పుతిన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలూ జరిగాయి. అయితే ఇప్పుడు తనపై కూడా అలాంటి పాయిజన్‌ ప్రయెగం జరుగుతుందనే భయంతో స్టాఫ్‌ను తొలగించాడు పుతిన్‌. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0