పాదయాత్రగా పిడుగురాళ్ళ చేరుకున్న శ్రీ లక్ష్మీపతి స్వామి

పాదయాత్రగా పిడుగురాళ్ళ చేరుకున్న శ్రీ లక్ష్మీపతి స్వామి

పిడుగురాళ్ళ, ఆగస్టు 6 (ఇండియాజ్యోతి) : ఉడిపి ఉత్తరాది మఠం(కర్ణాటక) నుండి పాదయాత్ర గా 4 దక్షిణాది రాష్ట్రాల మీదుగా పిడుగురాళ్ల కు శుక్రవారం  ఉదయము చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన  శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో బస చేశారు. పలువురు ప్రముఖులు ఆయనను కలసి పాదాభివందనం చేశారు. లోక కల్యాణార్థం తానూ పాదయాత్రలు చేస్తున్నానని స్వామిజీ పేర్కొన్నారు. త్వరలోనే కరోనా అంతరించి పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  తదుపరి పట్టణంలోని శ్రీ సాయి వృద్దాశ్రమానికి  వెళ్లి అక్కడ ఆశ్రమములో మధ్యాహ్న భోజనం చేసినారు. ఆశ్రమ అధ్యక్షులు ఏఎల్ నరసింహమూర్తి ఇతర కమిటీ సభ్యలు స్వామీజీ కి స్వాగతం పలికారు. పట్టణంలోని రోటరీ క్లబ్, వాసవి క్లబ్ వారు కూడా కలిసినారు. రోటరీ క్లబ్ వారు బెంగుళూరు బస్ టికెట్ బుక్ చేసినారు. శుక్రవారం  సాయంత్రం పిడుగురాళ్ళ నుండి బయలుదేరి కర్ణాటక రాష్ట్రానికి వెడుతున్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0