పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ కు నూతన హంగులు..
పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో వసతులు కల్పించి, రాత్రి పూట వెళ్లే అన్ని రైళ్లు కు స్టాపింగ్ ఇవ్వండి ..
డిఆర్ఏం ఏం. రామకృష్ణ కు వినతి పత్రం ఇచ్చిన రైల్వే బోర్డు సభ్యులు డా జూలకంటి శ్రీనివాసరావు
పిడుగురాళ్ల, మార్చి 06 (ఇండియాజ్యోతి) : అమృత భారత్ పథకం స్టేషన్ల రీ డెవలప్మెంట్ అభివృద్ధి లో భాగంగా గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ ఏం. రామకృష్ణ ప్రత్యేక రైలు లో ఆదివారం సాయంత్రం పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ ను సందర్శించి స్టేషన్ అభివృద్ధి కి ఆధునీకరణకు, ప్రయాణికుల మెరుగైన సౌకర్యాల కొరకు అవసరమైన సూచనలు చేసారు. డివిజనల్ రైల్వే మేనేజర్ మంగళగిరి రామకృష్ణ పిడుగురాళ్ల స్టేషన్ కు విచ్చేసిన సందర్భంగా రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, డివిజన్ రైల్వే యూజర్స్ కాన్సల్టెటివ్ కమిటీ బోర్డు సభ్యులు డా. జూలకంటి శ్రీనివాసరావు, పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, విద్యాశాఖ డైరెక్టర్ చింతా వెంకట రామారావు వారికి స్వాగతం పలికి జ్ఞాపిక, దృశ్యాలువతో ఘనంగా సత్కరించారు.
అనంతరం జూలకంటి శ్రీనివాసరావు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లలోని సౌకర్యలు, వసతులు, సమస్యలు, రైళ్లు నిలుపుదల గురించి డి ఆర్ ఏం మంగళగిరి రామకృష్ణ కు వినతి పత్రం అందజేశారు.
జూలకంటి మాట్లాడుతూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు సరైన సౌకర్యాలు, వసతులు లేవని ప్రయాణికులకు టాయిలెట్స్ తో జనరల్ వెయిటింగ్ రూమ్, మరియు వీఐపీ ఏ. సి. వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని రెండు ప్లాట్ ఫామ్ లలో కనీస వసతులైన మంచినీటి వసతి కల్పించాలని, ప్లాట్ ఫామ్ పై కప్పు చివరి వరకు పొడిగించాలని, ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయాలని, రెండవ ఫ్లాట్ ఫారం లో మంచినీటి వసతి కల్పించాలని, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, ప్రయాణికులు కూర్చోవడానికి మరిన్ని బెంచీలు ఏర్పాటు చేయాలని, రైల్వే స్టేషన్ కు వచ్చు మార్గములో మరియు రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి గ్రీనరీ ని పెంచలాని, స్టేషన్ లో వై ఫై సౌకర్యం కల్పించాలని, వృద్దులు, వికలాంగులు ఫ్లాట్ పారం మారటానికి లిఫ్ట్ సౌకర్యం కల్పించాలని, అమృత భారత్ స్కీం కింద పిడుగురాళ్ల రైల్వే స్టేషను ఎంపిక చేసారని అలాగే ఆదర్శ రైల్వే స్టేషన్ గా కూడా ఎంపిక చేయవలెనని డి ఆర్ ఏం ను కోరేరు.
అలాగే రైల్వే స్టాపింగ్ గురించి మాట్లాడుతూ పిడుగురాళ్ల స్టేషన్ నుండి వెళ్ళుతు, ఆగని నాలుగు రెగ్యులర్ రైళ్లు అయినా *ఎల్. టి. టి. ఎక్స ప్రెస్, భావనగర్ ఎక్స ప్రెస్, రామేశ్వరం ఎక్స ప్రెస్, ఇంటర్ సిటీ (ఎంప్లాయిస్ ట్రైన్) ఎక్స ప్రెస్*, లకు పిడుగురాళ్ల లో స్టాపింగ్ కల్పించాలని,
అలాగే కోవిడ్ నుండి పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో రాత్రిపూట వెళ్లే రైళ్లు స్టాపింగ్ తీసివేశారని ఇప్పుడు తిరిగి నర్సాపూర్ ఎక్స ప్రెస్, డెల్టా ఎక్స ప్రెస్, చెన్నై ఎక్స ప్రెస్, నారాయణాద్రి ఎక్స ప్రెస్, విశాఖ ఎక్స ప్రెస్, నాగర్సోల్ నుండి నర్సాపూర్ ఎక్స ప్రెస్ మొదలగు రైళ్లు కు రాత్రి సమయంలో కూడా తిరిగి స్టాపింగ్ ఇవ్వాలని,
గతంలో పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ నుండి కాచిగూడ వెళ్ళు ప్యాసింజర్ రైలు ఇప్పుడు నడికుడి స్టేషన్ నుండి వెళుతుందని ఈ రైలు మళ్లీ పిడుగురాళ్ల నుండి కాచిగూడ కు, రిటర్న్ రైలు కాచిగూడ నుండి పిడుగురాళ్ల కు నడపాలని డి ఆర్ ఏం ను కోరడం జరిగింది.
ఈ విజ్ఞప్తులను పరిశీలించి అవకాశం ఉన్నంతవరకు వీటిని త్వరగా పరిష్కరిస్తామని డివిజనల్ రైల్వే మేనేజర్ ఏం . రామకృష్ణ హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల రైల్వే ప్యాసింజర్ అసోసియేషన్ అధ్యక్షులు DRUCC రైల్వే బోర్డు మెంబెర్ డా జూలకంటి శ్రీనివాసరావు, పిడుగురాళ్ల మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు APEWIDC విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ చింతా వెంకట రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి, కౌన్సిలర్స్ షేక్ అబ్దుల్లా, మాదాల కిరణ్, అన్నం బంగారు రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చెదేళ్ల కృష్ణ యువ నాయకులు ఎండీ అలీం, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ మాస్టర్స్ విజయ్ కుమార్, కన్నీరాయుడు డివిజన్ రైల్వే ఉన్నతాధికారులు
అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ) ఆర్. శ్రీనివాస్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ పి. భాస్కర్ రెడ్డి, గుంటూరు డివిజన్ లోని ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు