నారా రామ్మూర్తినాయుడి మృతిపై..ఎవరెవరు సంతాపం తెలిపారంటే...ఫోటోలు..

నారా రామ్మూర్తినాయుడి మృతిపై..ఎవరెవరు సంతాపం తెలిపారంటే...ఫోటోలు..

 చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్‌తోపాటూ.. కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి వెళ్లి నివాళులు అర్పించారు. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు.. AIG ఆస్పత్రికి వెళ్లి.. రామ్మూర్తి నాయుడిని కడసారి చూసి.. సంతాపం తెలుపుతున్నారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. రామ్మూర్తినాయుడు వయసు 72 సంవత్సరాలు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించిందని తెలియగానే నారా లోకేశ్ తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికే నారా లోకేష్, దగ్గుబాటి పురందేశ్వరితో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. 1994లో టీడీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తినాయుడు గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆయనకు భార్య ఇందిర, కుమారులు నారా రోహిత్, గిరీశ్ ఉన్నారు. నారా రోహిత్ సినీ హీరో అనే విషయం తెలిసిందే. రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు రేపు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు రామ్మూర్తి నాయుడు పార్థీవదేహాన్ని తరలిస్తారు. ఆయనతోపాటూ.. చంద్రబాబు కూడా వెళ్తారు. ఆ తర్వాత రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి నారావారి పల్లెకు పార్థీవదేహాన్ని రోడ్డు మార్గంలో తీసుకెళ్తారు. చంద్రబాబు కూడా రోడ్డు మార్గంలో వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నారావారి పల్లెలో నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. వీటిని చంద్రబాబే దగ్గరుండి జరిపిస్తారు.

నారా రామ్మూర్తినాయుడి మృతిపై, తెలంగాణ సీఎం ఏపీ మంత్రుల దిగ్భ్రాంతి

రామ్మూర్తినాయుడి మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మృతి దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రామ్మూర్తినాయుడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ కు, కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. రామ్మూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇంకా రామ్మూర్తినాయుడు గుండెపోటుతో మరణించడం పట్ల మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢసానుభూతి తెలిపారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని స్పీకర్ పేర్కొన్నారు. 
రామ్మూర్తినాయుడి మృతి చంద్రగిరి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు తీరని లోటు అని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రామ్మూర్తినాయుడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అటు, శాప్ చైర్మన్ రవినాయుడు స్పందిస్తూ... రామ్మూర్తినాయుడి మృతి కలచివేసిందని అన్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
1