నరసరావుపేట లో అధికారులను పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ ' అరవిందబాబు' ..!
పాలన మారింది.. పద్దతి మారాలి
ప్రభుత్వం మారినా అధికారులు పాత ధోరణి వీడరా?
విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ఫోటో కార్యాలయంలో లేకపోవడం పై అసహనం ప్రభుత్వం మారి 22 రోజులైనా ఇంకా అధికారుల వైఖరి మారకపోతే ఎలాగని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు పట్టణంలోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా చేస్తున్నా..ఇంకా ఏర్పాటు చేయకపోవడాన్ని ప్రశ్నించారు.ప్రభుత్వం మారి ఇన్ని రోజులైనా ఎందుకు ఇంకా ఏర్పాటు చేయలేదని సిబ్బందిని ప్రశ్నించారు.గతంలో జగన్ రెడ్డి ఫోటోలు ఒక్క రోజులోనే ఏర్పాటు చేశారని,ఇప్పుడు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు.ఈ మేరకు ఎలక్ట్రిక్ డీఈకి ఫోన్ చేసి ప్రశ్నించారు.ప్రభుత్వం మారింది, అధికారుల పద్దతులు కూడా మారాలని,ప్రజల కోసం,ప్రజాస్వామ్య బద్దంగా పని చేయడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ సూచించారు._ అలాగే పట్టణంలో బుధవారం రాత్రి మున్సిపల్ అధికారులతో కలిసి నైట్ స్వీపింగ్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యను, పారిశుధ్య సమస్యలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.