నరసరావుపేటలో చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఇదే..
నరసరావుపేటలో చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఇదే
నరసరావుపేట, డిసెంబర్ 29 (ఇండియా జ్యోతి) : సీఎం చంద్రబాబునాయుడు నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న రానున్నారు.
ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలో బయల్దేరి 11 గంటలకు యల్లమంద గ్రామానికి చేరుకుంటారు.
11.05 నిమిషాలకు హెలిప్యాడ్ వద్ద సీఎంకు నేతలు, అధికారులు స్వాగతం పలుకుతారు. 11.10 గంటల నుంచి 11.40 వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు గ్రామంలో అందజేస్తారు.
11.40గంటల నుంచి 11.45 మధ్య యల్లమంద గ్రామంలోని కోదండరామస్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు.
11.45గంటల నుంచి 12.45 వరకు పింఛనుదారులు, యల్లమంద గ్రామస్థులతో మాట్లాడతారు.
12.45 నుంచి 12.50 మధ్య హెలిప్యాడ్ ప్రాంతంలో భోజనం చేస్తారు.
12.50 నుంచి 1.05 వరకు జిల్లా అధికారులతో సమావేశం ఉంటుంది.
అనంతరం 1.35 నుంచి 1.50 మధ్యలో కోటప్పకొండ చేరుకుంటారు. 1.50 గంటల నుంచి 2.20 వరకు త్రికోటేశ్వరస్వామి దర్శనం, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2.35 గంటలకు కోటప్పకొండ నుంచి యల్లమంద గ్రామంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 2.40 గంటలకు యల్లమందలో బయలుదేరి 3.10గంటలకు ఉండవల్లి చేరుకుంటారని అధికారవర్గాలు తెలిపాయి