నేడు పల్నాడు జిల్లాలో లోకేష్ పర్యటన..
పల్నాడు జిల్లా : నేడు పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. బొల్లాపల్లి మండలం రావులాపురంలో ఇటీవల హత్యకు గురైన టీడీపీ కార్యకర్త జల్లయ్య కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించనున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. కాగా, లోకేష్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. పల్నాడు టీడీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. టీడీపీ ఆధ్వర్యంలో కొండమోడు వద్ద లోకేష్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.