నేడు తిరుపతి లో భారీఎత్తున భగవద్గీత అఖండ పారాయణం..

నేడు తిరుపతి లో భారీఎత్తున భగవద్గీత అఖండ పారాయణం..

తిరుపతి : నేడు తిరుపతి నగరంలోని ఎల్‌బి స్టేడియంలో భారీఎత్తున భగవద్గీత అఖండ పారాయణాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గీతాజయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. దాదాపు లక్ష మంది యువతీ యువకులతో భగవద్గీత లోని 40 శ్లోకాలను పఠింపజేస్తామన్నారు. పలువురు ఆధ్యాత్మిక వాదులు, పీఠాధిపతులు, మఠాధిపతులు పెద్దఎత్తున కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుందన్నారు.

శ్రీరంగం ఆలయంలో నేడు వైకుంఠ ఏకాదశి

భూలోక వైకుంఠంగా కీర్తింపబడే సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయంలో మంగళవారం అధ్యయన ఉత్సవం వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. వైష్ణవాలయాల్లో ప్రతియేటా మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశినాడు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగడం ఆనవాయితీ. 

 

What's Your Reaction?

like
0
dislike
0
love
1
funny
0
angry
0
sad
0
wow
0