నిజాయితీని చాటుకున్న జీప్ డ్రైవర్..!

తిరుపతి జిల్లా...
పోగొట్టుకున్న బంగారు వస్తువులు మరియు నగదు గల బ్యాగు అప్పగింత..
తిరుమల అప్ ఘాట్ రోడ్డు లో విలువైన సొత్తు గల బ్యాగ్ ను పోగొట్టుకున్న యాత్రికులు.
నిజాయితీని చాటునున్న జీపు డ్రైవర్..
మీలాంటివారు సమాజానికి చాలా అవసరం అని కితాబు ఇచ్చిన జిల్లా ఎస్పి.
జీప్ డ్రైవర్ భూపతి నాయుడు ను ఘనంగా సన్మానించి రివార్డు అందించి, అభినందించిన జిల్లా ఎస్పీ.
ఆనందాన్నీ వ్యక్త పరిచి జిల్లా పోలీసులకు, జీప్ డ్రైవర్ కు ప్రశంసలు కురిపించిన బాధితుడు గోపాలకృష్ణ.
సమాజంలో జీపు డ్రైవర్ భూపతి నాయుడు లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్.,
నిన్న B. గోపాల కృష్ణ, వయ్యసు. 52 సం., తండ్రి. బలరాం నాయుడు, కృష్ణపల్లి గ్రామము, పార్వతిపురం, విశాఖపట్టణం జిల్లా మరియు అతని కుటుంబంతో శ్రీవారి ధర్శనం నిమిత్తం తిరుమల కు వెళ్ళేటప్పుడు అప్ ఘాట్ రోడ్ లో వాహనం దిగి ఫోటోలు తీసుకుంటూ వారివద్ద వున్న విలువైన బ్యాగును రోడ్డు ప్రక్కన వున్నా గోడపై పెట్టి, మరిచిపోయి అక్కడనుండి తిరుమల వెళ్ళి పోయారు.
భాదితులు తిరుమలకు చేరుకున్నాక బ్యాగు పోగొట్టుకున్నామని గ్రహించి, తిరుమల క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న జిల్లా ఎస్పి తక్షణమే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్ లను అప్రమత్తం చేయాలనీ క్షుణ్ణంగా వాహనాల తనిఖీలు చేపట్టి సొత్తును గుర్తించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
తక్షణమే స్పందించిన తిరుపతి & తిరుమల క్రైమ్ పోలీసులు, అలిపిరి, తిరుమల 2 టౌన్ పోలీసులు తిరుపతి తో పాటు తిరుమల కమాండ్ కంట్రోల్ ద్వారా పలిశిలించారు. సదరు బ్యాగును ఒక జీపు డ్రైవర్ తీసుకున్నట్లు గుర్తించారు.
సదరు బ్యాగులో ఉన్న నగదు రూ.1,50,000/- మరియు సుమారు రూ.8,40,000/- ల విలువ గల 140 గ్రాముల బంగారు ఆభరణాలు ( ఒక లాంగ్ చైన్, 2 బంగారు డాలర్లు గల చైన్లు, ఒక నెక్లెస్ డాలర్ మరియు ఒక జత చెవి కమ్మలు) మరియు 201 U.S. డాలర్లు మొత్తం అలాగే ఉండి నిజాయితితో అప్పగించిన జీపు డ్రైవర్ భూపతి నాయుడు గారిని ఘనంగా సన్మానించి రివార్డు అందజేసి జిల్లా ఎస్పి శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్., గారు అభినందించారు.
సదరు బ్యాగును జీపు డ్రైవర్ చేతుల మీదుగానే జిల్లా ఎస్పీ గారు భాధితులకు అలిపిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మీలాంటి వ్యక్తి ఈ సమాజానికి చాలా అవసరమని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరూ నిజాయితీగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఇలాంటి నిజాయితీగల వ్యక్తులను అభినందించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బాధితుడు గోపాలకృష్ణ తిరుపతి జిల్లా పోలీసులను, జీప్ డ్రైవర్ను ప్రశంసించి ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ కులశేఖర్ శాంతిభద్రతలు, అలిపిరి ఇన్చార్జి సీఐ జయ నాయక్, అలిపిరి ఎస్సై రామస్వామి, జీపు డ్రైవర్ భూపతి నాయుడు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?






