దేవాలయాల్లో, ప్రార్థన మందిరాల్లో 'గంట'ను ఎందుకు మోగిస్తారంటే.. ?!
హిందూమతంలో ఏదైనా పూజ లేదా కర్మ సమయంలో ఉపయోగించే ప్రతి వస్తువుకు ఒక ప్రాముఖ్యత ఉందని చెబుతారు.అయితే గుడిలో గంటకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అలాగే దేవాలయాలకి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా 'గంట'ను మోగిస్తుంటారు. పెద్దలు పిల్లల చేత కూడా కొట్టిస్తుంటారు. కానీ ఇలా గంటను ఎందుకు మ్రోగిస్తుంటారో చాలామందికి తెలియదు. గంట లో ఉండే ప్రతి భాగానికి ఒక్కో అర్థం దాగి ఉంది.గంట యొక్క వక్ర శరీరం అనంతంను సూచిస్తుంది.
గంట శబ్దం నాలుక జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని సూచిస్తుంది.గంట పిడికిలి భాగం హనుమంతుడు, గరుడు, నంది, సుదర్శన చక్రాలతో ప్రతీకగా ముడిపడి ఉంది.
అదేవిధంగా దేవాలయంలో గంట మోగిన చోట దుష్ట శక్తులు ఉండలేవు. దుష్టశక్తులు ఆ శబ్దం వినకూడదని శాపం. అందువల్లనే గంటను మోగించడం జరుగుతూ ఉంటుంది. గంటను మోగిస్తే హడలెత్తి పారిపోయే దుష్ట శక్తులు .. బిందెలను మోగిస్తే మాత్రం పరిగెత్తుకు వస్తాయనేది పెద్దల మాట. కొంతమంది సరదాకి బిందెలను .. పళ్లాలను చేత్తోగానీ .. గరిటెలతో గాని మోగిస్తుంటారు. అది దుష్టశక్తులు ఆహ్వానం పలకడం వంటిదని పెద్దల విశ్వాసం. అందువలన అలా చేసే వారిని పెద్దలు వెంటనే వారిస్తూ వుంటారు. కాబట్టి దేవాలయాలకు, ప్రార్థన మందిరాలకు వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గంటను మ్రోగించండి. అలాగే మీ ఇంట్లో పూజ మందిరాల్లో కూడా గంటను తప్పకుండా మ్రోగించండి