తొలిరోజే డిజిపి తో భేటీ అయిన ఎమ్మెల్యే అరవిందబాబు.. ఏం చెప్పారంటే??..

తొలిరోజే డిజిపి తో భేటీ అయిన ఎమ్మెల్యే అరవిందబాబు.. ఏం చెప్పారంటే??..

డీజీపీని కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు

నియోజకవర్గంలో శాంతిభద్రత పై నివేదిక

చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఉపేక్షించొద్దని డా౹౹చదలవాడ వినతి

నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి మొహమాటలకు పోకుండా ఉండాలని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.నూతనంగా నియమితులైన డీజీపీ ద్వారకా తిరుమల రావును మర్యాదపూర్వకంగా డీజీపీ కార్యాలయంలో కలిశారు.నియోజకవర్గంలో శాంతి భద్రతల గురించి వివరించారు.ఎన్నికల అనంతరం జరిగిన గొడవల గురించి తెలిపారు.నియోజకవర్గంలో జరిగిన ఘటనలు,ఇతర పరిస్థితుల గురించి వివరించారు.ప్రజలకు మేలైన పాలన అందించే విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చూడాలని డా౹౹చదలవాడ అరవింద బాబు కోరారు._

What's Your Reaction?

like
2
dislike
0
love
2
funny
0
angry
0
sad
1
wow
1