తిరుమల ఘాట్ రోడ్ లో కారు బోల్తా.. ముగ్గురు భక్తులకు గాయాలు..

తిరుమల, జూన్ 10 (ఇండియాజ్యోతి) : తిరుమల మొదటిఘాట్‌లో ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం ఓ కారు బోల్తా పడింది. వివరాలిలా వున్నాయి. చెన్నైకి చెందిన భక్త బృందం శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారు. దర్శనం పూర్తిచేసుకుని తమ కారులో తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో అలిపిరికి సమీపంలో ఓ మలుపు వద్ద కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ వాహనంలోని ముగ్గురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.
What's Your Reaction?






