తిరుమలలో ఎమ్మెల్యే డాక్టర్ 'చదలవాడ' ఫ్యామిలీ.. కాణిపాకం లో పూర్ణకుంభంతో స్వాగతం..
నరసరావుపేట, ఆగస్టు 10 (ఇండియా జ్యోతి) : రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ పరిష్కారమై రాష్ట్రం అభివృద్ది బాటలో నడిచేలా ఆశీర్వాదం అందించాలని కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని,అన్నిరంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని శ్రీవారిని ప్రార్ధించినట్లు ఎమ్మెల్యే డా౹౹చదలవాడ తెలిపారు.రానున్న ఐదేళ్లలో కూటమి పాలనలో రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ తొలగేలా చల్లటి దీవెనలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.సంక్షేమం,అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు దైవ సహకారం కావాలని కోరుకున్నారు.ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెరువేరుస్తున్నమని, ఇప్పటికే పెన్షన్లు పెంచి అందిస్తున్నామన్నారు.రికార్డు స్థాయిలో ఒకేసారి రూ.4000 ఇచ్చి చరిత్ర సృష్టించాం అన్నారు.ప్రజల ఆస్తులను కబ్జా చేసేలా తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టులను రద్దు చేశామని,పేదల కడుపు నింపేలా అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.ఇదే ఒరవడిలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగించేలా ఆశీర్వదించాలని స్వామి వారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.
కాణిపాకం వరసిద్ధి వినాయకుని సేవలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు
అలాగే, కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబుకి ఆలయ ఈవో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.రాష్ర్ట అభివృద్ధికి తోడుగా నిలవాలని కోరుకున్నట్లు తెలిపారు.జగన్ రెడ్డి పాలనలో అధ్వాన్నంగా తయారైన రాష్ట్రాన్ని పునాదుల నుండి నిర్మించుకునేందుకు కష్టబడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దైవ ఆశీస్సులు అందించాలని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు కోరుకున్నారు.అనంతరం వేదపండితులు ఆశీర్వాదం అందించారు. స్వామివారి ప్రసాదం,చిత్రపటం అందించారు.