తమిళనాడు సీఎం స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ..రుచికరమైన విందు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ రుచికరమైన విందు ఏర్పాటుచేశారు. ఆయన మంగళవారం తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సీఎం స్టాలిన్ నివాసంలో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా చాలా విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి స్టాలిన్ ను సీఎం కేసీఆర్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో జాతీయ రాజకీయపరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.
What's Your Reaction?






