తెనాలిలో కారు బీభత్సం..4 గురికి గాయాలు.. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం...

గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌లో ఉన్న కారు అదుపు తప్పి.పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న నలుగురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో ఒకరి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.. మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అలాగే కారు కింద పడి పలు ద్వి చక్ర వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. కాగా, ఈ కారును ఇద్దరు మైనర్లు కారు నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతివేగం కారణంగా కారు అదుపుతప్పి ఇలా రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్థానికులు సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కారు డ్రైవింగ్ చేసిన మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
What's Your Reaction?






