ఢిల్లీ లో తొలిరోజు ముగిసిన సీఎం జగన్ పర్యటన.. రేపు కూడా ఢిల్లీ లోనే ..

ఢిల్లీ లో తొలిరోజు ముగిసిన సీఎం జగన్ పర్యటన.. రేపు కూడా ఢిల్లీ లోనే ..

న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశం మంగళవారానికి ముగిసింది. రేపు కూడా ఢిల్లీ లో తన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్బంగా ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ, జగన్ మధ్య గంటకు పైగా చర్చ జరిగింది. ఏపీ అభివృద్ధి అంశాలను ప్రధానితో జగన్ ప్రస్తావించారు. క్రొత్త జిల్లాలకు నిధుల విడుదల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏపీకి ఆర్థిక చేయూత, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై విజ్ఞప్తి చేశారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి నిధులపై ప్రధానితో సీఎం జగన్ చర్చించారు. రాత్రికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌తో, హోంమంత్రి అమిత్‌షాను ఏపీ సీఎం జగన్ భేటీ అవుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఏపీలో కొత్తగా 13 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సహకరించాలని కోరే అవకాశం ఉంది. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
1
angry
0
sad
1
wow
0