డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ కు.. అంతర్జాతీయ వైద్యుల ప్రశంసలు..!
క్లిష్టతరమైన గుండె వైద్యంపై సమగ్ర విశ్లేషణ చేసిన డాక్టర్ కృష్ణ కాంత్
ఆశ్చర్యం వ్యక్తం చేసిన విదేశీ గుండె వైద్యులు
అంతర్జాతీయ స్థాయిలో గుండె వైద్యుల ప్రశంసలు
నరసరావుపేట, ఆగస్టు 04 (ఇండియా జ్యోతి) : సిన్సీషియమ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం నగరం లో ఆగస్టు 3, 4 తారీఖుల్లో "CHIP SUMMIT - 2024 " అంతర్జాతీయ గుండె వైద్య శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో దేశ , విదేశాలకు చెందిన పలువురు ప్రముఖ గుండె వైద్య నిపుణులు పాలుపంచుకుని గుండె వైద్య విధానాలలో వస్తున్న పలు నూతన పద్ధతులపై విస్తృతంగా చర్చించారు. దీనిలో నరసరావుపేట శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ గారు ప్రసంగించారు. డాక్టర్ కృష్ణ కాంత్ గారు నిర్వహించినక్లి ష్టతరమైన గుండె రక్తనాళాల స్టంట్ అమరిక గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సహచర వైద్య బృందానికి తను విజయవంతంగా నిర్వహించిన విధానాన్ని తెలియజేశారు. ఈ విధానం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు పలువురు గుండ వైద్యులు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణకాంత్ ను వారు అభినందించారు.
అలాగే, నరసరావుపేట పట్టణానికి చెందిన మరో 55 సంవత్సరాల మహిళలకు తీవ్రమైన గుండె నొప్పి రావడం వలన నరసరావుపేటలో స్థానికంగా ఉన్నటువంటి ఒక హాస్పిటల్ లో సంప్రదించంగా అక్కడి ఆంజియోగ్రాం లో గుండె కుడి రక్తనాళం కనిపించక తదుపరి వ్యాధి నిర్ధారణ కొరకు సిటీ యాంజియో గ్రామ్ పరీక్షను సిఫారసు చేశారు.
అయితే ఆ పేషంటు వ్యాధి నిర్ధారణ కొరకు డాక్టర్ గార్లపాటి కృష్ణ కాంత్ గారిని సంప్రదించగా డాక్టర్ గారు నాలుగు గంటల పాటు శ్రమించి పుట్టుకతోనే కుడి రక్తనాళం వైకల్యంతో ఉన్నదని, ఎడమ దమని నుండి విడివడి వస్తున్నదని నిర్ధారించి , ఇటువంటి క్లిష్టతరమైన సమస్యలకు సాధారణంగా వాడే వైద్య పరికరాలతో ట్రీట్మెంట్ నిర్వహించలేమని గ్రహించి అత్యాధునిక వైద్య పరికరాలతో నాలుగు గంటల పాటు శ్రమించి క్లిష్టతరమైన స్టంట్ అమరికను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల కాలంలో శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇటువంటి క్లిష్టతరమైన స్టంట్ అమరిక కేసులను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని సహచర వైద్య బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు.