జీవితాన్ని ప్రొడక్టివ్ గా తీసుకోని ఆనందించండి : మేధా చిరంజీవి

జీవితాన్ని ప్రొడక్టివ్ గా తీసుకోని ఆనందించండి :  మేధా చిరంజీవి

కావలి (దాసరి శివ) : ప్రముఖ ఆంగ్ల భాషా నిపుణుడు, రచయిత, ప్రేరణాత్మక వక్త *మేధా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్  వ్యవస్థాపకుడు మేధా చిరంజీవి శుక్రవారం  కావలి, DBS ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు *ఇంటర్వ్యూ లో సక్సెస్ అవటం ఎలా ?? అనే సబ్జెక్టు మీద తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు సంపాదించడం లో మెళకువలు మరియు వారి కెరీర్ కు సంబంధించిన సలహాలు ఇవ్వడంతోపాటు జీవితాన్ని ప్రొడక్టివ్ గా తీసుకోని ఆనందించండి, బాగా చదువుకోని సమాజంలో మంచి హోదాను పొందాలని విద్యార్థులకు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ దామిశెట్టి బాల సురేష్ బాబు గారు మాట్లాడుతూ వ్యక్తిగత శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు వ్యక్తిత్వ వికాసంలో సమర్థవంతమైన మార్గదర్శకత్వాన్ని  నేర్పించడం కోసం పేరెన్నికగన్న బహుళజాతీయ కంపెనీ  ప్రతినిధి ఆహ్వానించి విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం జరుగుతుందని, ఇవి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇకముందు కూడా ఉన్నతమైన వ్యక్తులని   కళాశాలకు తీసుకువచ్చి విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీవీ రావు ప్లేస్మెంట్ ఆఫీసర్ భార్గవ్ రామ్, విద్యార్థులు, అధ్యాపకులు  అన్ని విభాగాల అధిపతులు, AO  రమేష్ బాబు  పాల్గొన్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
1
funny
0
angry
0
sad
0
wow
0