జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం..
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన రావు (63) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో పోరాడుతున్న ఆయన తార్నాకలోని తన సొంత ఇంట్లో ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు తార్నాకలోని ఒక హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాసవిడిచారు.
రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉండే కాలంలో సుధాకర్ రావు యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా పనిచేశారు. ఆయనకి భార్య, అనసూయ, వైష్ణవి కుమార్తెలు. కాగా సుధాకర్ రావు మృతికి పలువురు సినీ, టీవీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.