జనవరి 1న గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్...

గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 1న గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న వృద్దాప్య పెన్షన్‌ను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ ఇటీవల నిర్ణ యం తీసుకున్నసంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్తిపాడులో నిర్వహించడం కోసం సీఎం జగన్ ఇక్కడకు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున పండగలా చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు. అధికారులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
What's Your Reaction?






