జగన్‌పై ఏసీబీ కేసు నమోదు..
ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదులతో హెచ్‌ఎండీఏ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు మాజీ డీఎస్పీ జగన్ ఇల్లు, బంధువులు, ఫ్రెండ్స్ ఇండ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ డీఎస్పీగా జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డట్లు, అక్రమంగా వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2019లో విజిలెన్స్ డీఎస్పీగా ఉన్న జగన్‌ను నవంబరులో డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేశారు. తనికీలు ఇంకా కొనసాగే అవకాశం వుంది.