ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కానిస్టేబుళ్లు దుర్మరణం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. జాలిగామ బైపాస్ రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఓ బైక్ ను వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మరణించిన వారిని పంధాములు(43), పూస వెంకటేశ్వర్లు(42)గా గుర్తించారు. పరంధాములు రాయపోల్ పోలీస్ స్టేషన్ లో, వెంకటేశ్వర్లు దౌల్తాబాద్ పీఎస్ లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం ఈసీఐఎల్ లో జరుగుతున్న మారథాన్ లో పాల్గొనేందుకు వారిద్దరూ బైక్ పై బయలుదేరగా జాలిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగిందని వివరించారు. కాగా.. ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. అనుమానిత వాహనాన్ని నిలిపింది ఎవరన్నా దానిపై ఆరా తీస్తున్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
0