ఘనంగా సత్తెనపల్లి రోటరీక్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

సత్తెనపల్లి, జులై 29 (ఇండియాజ్యోతి) : సత్తెనపల్లి రోటరీక్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ నందు  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ  రోటరీ క్లబ్ ద్వారా చేసే కార్యక్రమాలు ప్రజలకు  ఉపయోగపడే విధంగా ఉన్నాయని  నూతన కార్యవర్గ సభ్యులు మంచి కార్యక్రమాలు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కే పీ రంగారావు గారు నూతన కార్యవర్గ సభ్యులు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ కెే వి ఆంజనేయులు, మండల విద్యాశాఖాధికారి ఎ. శ్రీనివాసరావు, ప్రజ్వల  కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు  గౌరీ శిరీష, నూతన అధ్యక్షులు బెల్లంకొండ నాగ సాయి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఉప్పుతోళ్ల  వెంకటేశ్వర్లు, కోశాధికారి ఎస్ బాల సుబ్రహ్మణ్యం, నూతన సభ్యులుగా మాజేటి వెంకటేశ్వర రావు,  దేవల్ల ఆదినారాయణ, ఉల్లం రాణి, షేక్ మహబూబ్ సుభాని, షేక్ రెహమాన్, పాలేటి రామస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. రోటరీ సేవా కార్యక్రమాల్లో భాగంగా భాగ్యశ్రీ ఈ-కామర్స్  ట్రస్టు ద్వారా 10 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ప్రజ్వలన కమ్యూనిటీ సొసైటీ ద్వారా 50 మందికి బియ్యము నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం  జరిగింది.  ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు చందోలు వెంకట మల్లికార్జునరావు, పెరుమాళ్ల లక్ష్మీ శివన్నారాయణ, డోగిపర్తి సత్యనారాయణ, బాపతు శ్రీనివాస రెడ్డి, నల్లమోతు శ్రీనివాసరావు, రావిక్రింద సుబ్బారావు, బండారు అనిల్ సురేష్ బాబు,వేముల వరప్రసాద్, పల్లపు శివయ్య, యలమంద, ఏసయ్య, దేవళ్ళ నాగయ్య ఉప్పుతోళ్ల హరి మరియు ఆర్టీసీ సిబ్బంది, దాతలు పాల్గొన్నారు..

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0