ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సతైనపల్లి టౌన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సతైనపల్లి టౌన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

(ఇండియాజ్యోతి ప్రతినిధి.. కే. శ్రీనివాస్)

సత్తెనపల్లి, జులై 19 (ఇండియాజ్యోతి) : లయన్స్ క్లబ్ ఆఫ్ సతైనపల్లిటౌన్ నూతన కార్యవర్గ (2021.22) ప్రమాణ స్వీకార కార్యక్రమం పి.రామకోటయ్య అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్  డా.చెన్నంశెట్టి చక్రపాణి  రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు మాట్లాడుతూ గత39 సంవత్సరాలు గా సతైనపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ సతైనపల్లిటౌన్ అభినందనీయమన్నారు. ప్రభుత్వ పరంగా అందని కొన్ని సేవలను స్వచ్చంద సంస్థలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలతో పాటు,న్యాయ విభాగానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసి, శాంతిభద్రతల విషయంలో సేవా సంస్థలు పోలీసులకు సహకరించాలన్నారు.ఒక పేద మహిళలకు కుట్టు మిషన్ ను కొర్రపాటి ఫౌండేషన్ గుంటూరు వారి సహకారంతో ముఖ్య అతిథి చేతులమీదుగా అందించారు.లయన్ కృపానందం నూతన సభ్యులతో ప్రమాణం చేయించారు.అనంతరం లయన్ ఆర్.లక్ష్మీనారాయణ  నూతన కార్యవర్గం తో ప్రమాణం స్వీకారం చేయించారు.లయన్ వెలగా శరత్ బాబు పూర్వ గవర్నర్,లయనిజం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సభ్యులకు వివరించారు.కార్యక్రమంలో పొన్నూరు క్లబ్ అధ్యక్షులు లయన్ కోట శ్రీనివాసరావు వై.కోటేశ్వరరావు రామ్మోహనరావు లయన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని లయన్ వై.పి.మురళీ గమాష్టర్ ఆఫ్ శర్మనీ గా వ్యవహరించారు. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0