గ్రీన్ నరసరావుపేట గా తీర్చిదిద్దటమే లక్ష్యం... ఎమ్మెల్యే 'గోపిరెడ్డి'
నరసరావుపేట, జులై 31 (ఇండియాజ్యోతి) : రానున్న కాలం లో నరసరావుపేట ప్రాంతాన్ని గ్రీన్ నరసరావుపేట పట్టణం గా తీర్చిద్దేందుకు రూపకల్పన చేస్తున్నాము అని శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.శనివారం స్థానిక యర్రం శెట్టి మోటర్స్ వారి సారధ్యంలో మొక్కల పేపకం అనే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పచ్చగా ఉందని రానున్న కాలంలో మరిన్ని మొక్కల నాటి ఇంకా పచ్చదనం పెంచే విదంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎం.ఎల్ ఏ తెలిపారు.

అలాగే గుంటూరు జిల్లా కు త్వరలోనే అధిక మొక్కలు వస్తున్నాయి అని వాటిలో అధిక శాతం మన నరసరావుపేట ప్రాంతానికి తీసుకొని వచ్చి గ్రీన్ నరసరావుపేట ప్రాంతం గా మారుస్తాం అని అన్నారు.అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే గుంటూరు రోడ్డు పిడుగురాళ్ల రోడ్డు లో అతి సుందరంగా తయారు చేసాము అని అన్నారు. అలాగే ప్రతి మండలం లో లక్షల సంఖ్యలో మొక్కలు నాటి రాష్ట్రాని హరిత హారం చెయ్యాలి అని అన్నారు.ఈ సమావేశంలో ఆర్డిఓ గారు, ఎమ్ఆర్ఓ గారు,కమిషనర్ గారు,డిఎస్పీ గారు,యర్రం శెట్టి మోటర్స్ సిబ్బంది పాల్గొన్నారు.