గూగుల్ కు పోటీగా.. కొత్త టెక్నాలజీ చాట్‍ జీపీటీ

గూగుల్ కు పోటీగా..  కొత్త  టెక్నాలజీ చాట్‍ జీపీటీ

గూగుల్ కు పోటీగా కొత్త సెర్చ్ ఇంజిన్ వస్తోంది!

టెక్నాలజీ రంగంలో చాట్‍ జీపీటీ ఓ సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచం లోని ఎంతో మంది ఈ ఏఐ చాట్‌బోట్‌పై ఆధారపడుతున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు.. దీన్ని వినియోగిస్తూ.. సమాచారం తెలుసుకుంటున్నారు. మన తెలుగు ప్రజలు కూడా దీన్ని వినియోగించడం ఇప్పుడిప్పుడే ప్రారంభించారు.

చాట్ బాట్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి విప్లవాత్మక రీతిలో చాట్ జీపీటీ రూపొందించిన టెక్ సంస్థ ఓపెన్ ఏఐ ఇప్పుడు సరికొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకువస్తోంది. దీనిపేరు సెర్చ్ జీపీటీ. సెర్చ్ ఇంజిన్ రంగంలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించిన గూగుల్ ను సవాల్ చేస్తూ ఓపెన్ ఏఐ ఈ నూతన సెర్చ్ ఇంజిన్ ను ప్రకటించింది. 

ప్రస్తుతానికి సెర్చ్ జీపీటీ అభివృద్ధి దశలో ఉంది. పరిమితస్థాయిలో యూజర్లతోనూ, పబ్లిషర్లతోనూ దీనిని పరీక్షిస్తున్నారు. సెర్చ్ జీపీటీ సాయంతో రియల్ టైమ్ డేటా యూజర్ల ముందు ప్రత్యక్షమవుతుందని ఓపెన్ ఏఐ చెబుతోంది. 

దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్‌ఫార్మర్. అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతతో చాట్‍ జీపీటీ పని చేస్తుంది. ఈ చాట్ జీపీటీని ఏ ప్రశ్న అయినా టెక్స్ట్ రూపంలో అడగవచ్చు. ఆ ప్రశ్నకు ఈ ఏఐ టూల్ వివరమైన సమాధానాన్ని అత్యంత వేగంగా, వివరంగా ఇస్తుందనే పేరుంది. ఈ చాట్ జీపీటీలో ఎంతో అపారమైన డేటా బేస్ ఉంటుందని చెబుతున్నారు. డేటా బేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా ఇది ఆన్సర్ చెప్పేస్తోంది.

What's Your Reaction?

like
2
dislike
0
love
1
funny
1
angry
0
sad
0
wow
0