కాబోయే భర్తతో ఆనందంగా డ్యాన్స్ చేసింది, మూడుముళ్లు వేసాక ఆత్మహత్య చేసుకుంది

కాబోయే భర్తతో ఆనందంగా డ్యాన్స్ చేసింది, మూడుముళ్లు వేసాక ఆత్మహత్య చేసుకుంది
మహబూబ్ నగర్ : తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లక్ష్మి(20) అనే యువతికి, అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్‌కి నిన్న వివాహం జరిగింది. పెళ్లయ్యాక అప్పగింతల కార్యక్రమం జరుగబోతోంది. ఇంతలో ఇంట్లో నుంచి కేకలు, ఏడుపులు. ఏం జరిగిందని చూస్తే... నవ వధువు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తనకు పెళ్లి ఇష్టం లేదని లక్ష్మి ఇంట్లో చెప్పింది. ఐతే మంచి సంబంధం, బాగా ఆస్తిపరులు, అబ్బాయి బుద్దిమంతుడు, కూతురికి అంతకంటే మంచి సంబంధం రాదని పెద్దలు నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. దాంతో పెళ్లికి ముందు జరిగిన ప్రి-వెడ్డింగ్ తదితర కార్యక్రమాలలో లక్ష్మి ఎంతో హుషారుగా పాల్గొంది. అవన్నీ చూసి... తమ కుమార్తె పెళ్లికి ఆనందంగా అంగీకరించింది అనుకున్నారు కానీ.. మూడుముళ్లు పడ్డాక ఆమె తన ప్రాణాలను తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వధువు ఎవరినైనా ప్రేమించిందా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
కాగా, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లక్ష్మి(19) 10వ తరగతి వరకూ చదువుకుంది. ఆ తర్వాత చదువు మానేసి ఇంటికే పరిమితమైంది. ముగ్గురు కూతుర్లున్న ఆ తల్లి.. పెద్దకూతురికి పెళ్లి చేసి పంపాలనుకుంది. దీంతో అనంతపురం జిల్లాకు చెందిన మల్లికార్జున్ తో మే 12వ తేదీన పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం డీజే పాటలకు నవ దంపతులు కలిసి స్టెప్పులేశారు. కానీ.. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఉదయం 9 గంటలకు పెళ్లైంది. మధ్యాహ్నం అందరితో కలిసి భోజనం చేసింది లక్ష్మి. సాయంత్రం అప్పగింతల సమయానికి ముందు.. తనకు ఇష్టంలేని పెళ్లి చేసి అత్తారింటికి పంపుతున్నారన్న బాధతో లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

What's Your Reaction?

like
0
dislike
0
love
1
funny
0
angry
0
sad
3
wow
0