కడపలో బాబు కోసం పోటెత్తిన ప్రజానీకం.. అదుపు చేయలేక పోలీసుల తంటాలు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. పార్టీలు తమ ప్రచారం కోసం పాకులాడుతున్నాయి. రాబోయే ఎన్నికల కోసం ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోరు రసవత్తరంగా మారుతోంది. పార్టీల మధ్య వ్యూహాలు కూడా కొత్త మార్గాల్లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. దీంతో పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. రెండు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు తమ వైపే ఉన్నారని వైసీపీ భావిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని టీడీపీ చెబుతోంది. ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే పని అయిపోతుందా? వారి సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ పై లేదా అని టీడీపీ ప్రశ్నిస్తోంది. తమ కంటే ఇంకా బాగా ఎవరు చేయలేరనే ధీమా వైసీపీ వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. ఎలాగైనా ఓటర్లను ప్రభావితం చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.
బుధవారం కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున రావడం సంచలనం కలిగిస్తోంది. టీడీపీ అధికారంలోకి రావడం కల అని వైసీపీ చెబుతున్నా పరిస్థితి చూస్తుంటే టీడీపీ కూడా మెల్లగా తన ప్రభావం చూపించనుందని తెలుస్తోంది. కడపలో జనం రోడ్లపై తిరుగుతుంటే వారిని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. చంద్రబాబుకు మెల్లగా జనంలో ఫాలోయింగ్ పెరుగుతుందని తెలుస్తోంది.