ఏపీ లో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్..

ఏపీ లో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్టంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.2,134 కోట్లతో ఐదు పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా.. 7,683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.
ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు..
►వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, రిటైల్ లిమిటెడ్ ఏర్పాటు
►ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్న ఆదిత్యా బిర్లా
►రూ.110 కోట్ల పెట్టుబడి, 2112 మందికి ఉద్యోగాలు►వైఎస్సార్ జిల్లా బద్వేలులో ప్లైవుడ్ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న సెంచురీ
►రూ.956 కోట్ల పెట్టుబడి, 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
►ఈ పరిశ్రమ ఏర్పాటు కారణంగా రైతులకు భారీగా మేలు జరుగుతుందన్న అధికారులు
►దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్ చెట్లను కొనుగోలు చేస్తారన్న అధికారులు
►దాదాపు రూ.315 కోట్ల ఉత్పత్తులను రైతులనుంచి కొనుగోలు చేస్తారన్న అధికారులు
►తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్
►చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రాసిం ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ
►ఈ కంపెనీ ద్వారా రూ.861 కోట్ల పెట్టుబడి, 405 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
►స్థానిక ప్రజల ఆందోళన నేపథ్యంలో థర్మల్‌పవర్ ప్లాంట్‌ను పెట్టబోమని స్పష్టంచేసిన గ్రాసిమ్ కంపెనీ
►స్థానిక ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకున్నామంటూ స్పష్టంచేసిన కంపెనీ.. కంపెనీ స్పష్టత నేపథ్యంలో ఎస్‌ఐపీబీ ఆమోదం
What's Your Reaction?






