ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు.. కొత్త డీజీపీ గా 'రాజేంద్రనాథ్‌రెడ్డి'..

ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు.. కొత్త డీజీపీ గా 'రాజేంద్రనాథ్‌రెడ్డి'..

అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు పడింది. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని గౌతమ్‌ సవాంగ్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.  ప్రభుత్వం గౌతమ్‌ సవాంగ్‌కి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. కాగా గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, హైదరాబాద్‌ వెస్ట్ ఐజీగా వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. అలాగే కేంద్రం నుంచి అనుమతి రాగానే ఏపీ ప్రభుత్వం డీజీపీగా కసిరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించనుంది. ఇదిలావుంటే సవాంగ్ పనితీరుపై సీఎం జగన్‌కు సంతృప్తి కలగలేదని అందుకే బదిలీ వేటు పడిందని తెలుస్తోంది. 

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0