ఉపాసనకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ ప్రభుత్వం

ఉపాసనకు అరుదైన గౌరవం.. గోల్డెన్ వీసా ఇచ్చిన యూఏఈ ప్రభుత్వం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్స ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ఉపాసనకు గోల్డెన్ వీసా అందించింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రిస్మస్ కు ఓ కానుక అందుకున్నానని తెలిపారు.

ఇటీవల జరిగిన ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ఈ ప్రపంచమంతా ఒక్కటే అని తెలుసుకున్నానని, ‘వసుధైక కుటుంబం’ అనే భావనకు అర్థం తెలిసిందని ఉపాసన అన్నారు. ఈ క్రమంలో యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. తాను భారతీయురాలిననని, అయితే అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం ఉందన్నారు. ఇప్పుడు గోల్డెన్ వీసా రాకతో అధికారికంగా ప్రపంచ పౌరురాలిని అయ్యానని ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0