ఇండియాలో 3 (HMPV) కేసులు.. భయాందోళనలో ప్రజలు

ఇండియాలో 3 (HMPV)  కేసులు.. భయాందోళనలో ప్రజలు

చైనా నుంచి వ్యాపిస్తున్న మరో వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తోంది. ఈ హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ (HMPV) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వేగంగా ఇతర దేశాలకు వ్యాపిస్తున్నాయి. ఈ వైరస్‌ను మొదట 2001లోనే గుర్తించారు. ఇప్పుడు చైనాలో దీని ప్రభావం, తీవ్రత పెరిగాయి. ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే ఈ వైరస్, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారికి ప్రమాదకరం.

ఈ క్రమంలో చైనాలో కొత్తగా విజృంభించిన మరో వైరస్ హెచ్ఎంపీవీ ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఇండియాలో కూడా తొలి కేసు నమోదు చేయటం అందరిలోనూ ఆందోళనలను పెంచేస్తోంది. ఇండియాలో మొత్తం 3 కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. గుజరాత్ లో, మరియు కర్ణాటకలో కూడా మరో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఛైనా నుండి వచ్చినదేనా అని అనుమానం వ్యక్తమవుతోంది.

కర్ణాటక బెంగుళూరులో 8 నెలల చిన్నారి హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) పాజిటివ్‌గా పరీక్షల్లో తేలింది. దీంతో దేశంలో మెుదటి కేసు నమోదు కావటం అందరినీ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. పైగా పాపకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని వెల్లడైంది. జనవరి 2న బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో సేకరించిన పాప శాంపిల్స్ పాజిటివ్‌గా వెల్లడైంది. ప్రస్తుతం పాజిటివ్ రిపోర్టు ప్రైవేటు ల్యాబ్ అందించిన రిపోర్టులో వెల్లడైందని, ప్రభుత్వ ల్యాబ్ దీనిని నిర్థారించలేదని కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రి పరీక్షలపై తమకు ఎలాంటి సందేహం లేదని వారు పేర్కొన్నారు.

బెంగళూరులో HMPV కేసు గురించి కర్ణాటక ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందించిందని వెల్లడైంది. దీనిపై ఎలా ముందుకు సాగాలనే దానిపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కేంద్ర మంత్రిత్వ శాఖ రెండింటి నుంచి మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం శిసువు ఆందోళనకరమైన లక్షణాలను చూపలేదని వైద్యులు చెబుతున్నారు. కరోనా సమయంలో మాదిరిగానే ఆందోళనలు పెరిగితే తిరిగి దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయని వారు చెబుతున్నారు. చైనాలో విపరీతంగా కేసులు పెరుగుతున్న వేళ ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం అవుతున్నాయి. చైనాలో ముఖ్యంగా ఉత్తర ప్రావిన్సులలో HMPV కేసులు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న ఇటీవలి వీడియోలు రోగుల తాకిడితో చైనీస్ ఆసుపత్రులు కష్టపడుతున్నాయని చూపుతున్నాయి.

HMPV లక్షణాలు, వ్యాప్తి..? కరోనా మాదిరిగానే HMPV వైరస్ సోకిన వ్యక్తుల్లో దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి తుంపరల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనికి తోడు జ్వరం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ముక్కులు మూసుకుపోవటం, గొంతు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇన్ఫెక్షన్ కారణంగా కొంతమంది రోగులకు బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రస్తుతం సమర్థవంతమైన మందు లేనందున లక్షణాలకు తగ్గట్టుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

What's Your Reaction?

like
0
dislike
0
love
0
funny
0
angry
0
sad
1
wow
1