ఆంధ్ర రాష్ట్రంలోనే ‘ తొలి అడ్వెంచర్ పార్కు 'గా సీతంపేట.. (వీడియో)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్వతిపురం మన్యం జిల్లా కేంద్రం నుండి 67 కి.లో మీటర్ల దూరంలో సీతంపేట కేంద్రంలో చుట్టు ఎతైన కొండల నడుమ సముద్ర మట్టానికి సుమారు 140 మీటర్ల ఎత్తులో 'ఎన్.టి.ఆర్ అడ్వెంచర్ పార్కు’ ఏర్పాటు అయినది. ఈ పార్కు ఎన్నో ఉల్లాసభరితమైన, వైవిధ్య భరితమైన విహారాలతో ఆబాల గోపాలాన్ని అలరిస్తూ రాష్ట్రంలోనే ‘ తొలి అడ్వెంచర్ పార్కు 'గా ఆనతి కాలంలోనే వినుతికెక్కింది.

ఆవిర్భావం :

ఈపార్కు నిర్మాణంలో ఒక అధికారి విశేష కృషి దాగి ఉంది నవంబరు 2016 నుండి ఏప్రిల్ 2019 వరకు ఇక్కడ ప్రాజెక్టు ఆఫీసర్ ( పి.ఓ) గా పని చేసిన శ్రీ లోతేటి శివ శంకర్, I.A.S గారు ఈ పార్కును రూప కల్పన చేసారు. సుమారు 3.2 ఎకరాల ఈ చెరువు పశువులకు ఆవాసంగా , బహిరంగ మల విసర్జనకు ఆలవాలంగా ఉండేది. దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దితే ప్రాంతీయ అభివృద్ధి తో పాటు స్ధానిక గిరిజన యువతకు ఉపాధి కలుగుతుందనే ఉద్దేశ్యముతో 14 ఏప్రిల్ 2017 అంబేద్కర్ జయంతి రోజున ‘జలవిహర్’ అను పేరు తో శంఖుస్థాపన చేశారు. అయితే జిల్లా లోనే ఒక మారుమూలా ప్రాంతంలో ఉన్న ఈ చిన్న చెరువును పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించాలంటే దీనితోపాటు సమీప పర్యాటక ప్రాంతాల అభివృది తప్పని సరి అని గుర్తించి ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న 'మెట్టగూడ ' జలపాతాన్ని ముందుగా అభివృది చేశారు. తొలిదశలో పార్కు నిర్మాణ అంచనా వ్యయం కేవలం 40 లక్షల రూపాయలే కానీ పార్కుకు అదనపు హంగులతో మరింత ప్రత్యేకత తీసుకు రావడం కోసం అదనపు నిధులు అవసరమని గుర్తించి సంబంధిత పభుత్వ శాఖలను సమన్వయము చేసి అత్యంత పారదర్శకంగా పార్కు నిర్మాణం తలపెట్టారు పార్కు కోసం స్ధానిక గిరిజ , గిరిజనేతర రైతులు సుమారు 6 ఎకరాలను ఉచితంగా ఇచ్చారు. కేవలం రూ. 40 లక్షల అంచనాతో 3 ఎకరాల 'జల విహార్' గా జరిగిన శంఖుస్థాపన ఒక సంవత్సర కాలంలో నే ఇలా పలు శాఖల సహకారంలో మూడు కోట్ల వ్యయమై యన్.టి.ఆర్ సాహస ఉద్యాన వనంగా తేది. 25-04-2018 న ప్రారంభించబడినది. స్ధానిక గిరిజన యువత తో ఒక గిరిజన సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి వారితోనే ఈ పార్కు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధ తో పరిరక్షించిన "1920-30 బ్రిటిష్ కాలంనాటి ఇండిగో చిమ్ని "పార్కుకు అదనపు ఆకర్షణ. ఒక సంవత్సర కాలంలోనే 3.5 లక్షల మంది పార్కును సందర్శించడం గొప్ప విశేషం.

పార్కు ప్రత్యేకతలు :

1. ఆంధ్రప్రదేశ్ లోనే తొలి సాహస ఉద్యానవనం

2. ఆంధ్రప్రదేశ్ లోనే పూర్తిగా గిరిజన యువత తో నిర్వహిస్తున తొలి పార్కు.

3. ఆంధ్రప్రదేశ్ లోనే "భూమి జల మరియు గగన విహారాలు" ఒకే చోట ఉన్న తొలి పార్కు .

4. "గ్రామీణ ఆంధ్రప్రదేశ్ " లోనే తొలి 5D థియేటర్ నెలకొల్పబడిన పార్కు.

5. ఆనాటి బాల్య జానపద క్రీడల స్మృతుల్ని వివిధ శిల్పాల ద్వారా ఆవిష్కరించిన తొలి పార్కు.

What's Your Reaction?

like
1
dislike
0
love
2
funny
1
angry
0
sad
0
wow
1