అరవిందబాబా..మజాకా..!

అరవిందబాబా..మజాకా..!

గెలిపించారు.. నిలబడి చూపిస్తా..

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్,మంత్రులు నారా లోకేష్,అచ్చెన్నాయుడిని కలిసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ

నరసరావుపేట గడ్డ పై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞుడనై ఉంటానని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదరవాడ అరవింద బాబు తెలిపారు.ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,ఐటీ మంత్రి నారా లోకేష్,వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తికి అసామాన్య విజయం అందించేందుకు తోడుగా నిలిచారన్నారు.గెలుపు కోసం తోడ్పాటు అందించిన ప్రతి నాయకునికి నియోజకవర్గ అభివృద్ధితో కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు.రెండు దశాబ్దాలకు పై గా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన దాఖలాలు లేవని తెలిపారు.

అలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి,గెలిపించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞుడనని డా౹౹చదలవాడ తెలిపారు._

What's Your Reaction?

like
1
dislike
0
love
0
funny
0
angry
0
sad
0
wow
0