అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..93% వరకు తగ్గింపు..!!

అమెజాన్ గ్రేట్  ఇండియన్ ఫెస్టివల్ సేల్..93% వరకు తగ్గింపు..!!

ప్రతి సంవత్సరం ఆన్ లైన్ షాపింగ్ ప్రియుల కోసం అమెజాన్ తన గ్రేట్  ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తుంటుంది. మరో పోటీదారు ఫ్లిప్‌కార్ట్ సైతం ఇలాంటి ఆఫర్ల వర్షంతో ప్రజలను ఆకర్టుకునే ప్రయత్నం పండుగల సీజన్లో చేస్తుంటుంది. గృహోపకరణాల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అనేక ఉత్పత్తులను ఈ సమయంలో అధిక డిస్కౌంట్లకు కంపెనీలు విక్రయిస్తుంటాయని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ వీటికి సమయం ఆసన్నమైంది.

పండుగల సీజన్ సమీపిస్తున్నందున చాలా కాలంగా ఆఫర్లో వస్తువులు కొనుక్కోవాలని చూస్తున్న షాపింగ్ లవర్స్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. ఇది చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్ కూడా. ఇందులో గృహోపకరణాలు, కిచెన్ ఎక్విప్మెంట్ నుంచి ఎలక్ట్రానిక్స్, అత్యాధునిక గాడ్జెట్‌లు, స్టైలిష్ ఫర్నిచర్ సహా మరెన్నో ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయి. సేల్ 2024 సందర్భంగా వాషింగ్ మెషీన్‌లపై గరిష్టంగా 50% తగ్గింపు అమెజాన్ అందుబాటులో ఉంచనుంది. లాండ్రీ సెటప్‌ను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్న చాలా మందికి ఇది గొప్ప సమయంగా చెప్పుకోవచ్చు.

ఇక విస్తృత శ్రేణి రిఫ్రిజిరేటర్‌లపై 35% వరకు తగ్గింపుతో మెగా ఆఫర్లను అమెజాన్ సేల్ అందించటానికి సిద్ధమౌతోంది. సింగిల్ డోర్, డబుల్ డోర్, పక్కపక్కనే లేదా చిన్న రిఫ్రిజిరేటర్ల కొనుగోలుదారులకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది. వంటగది ఉపకరణాలను అప్‌గ్రేడ్ చేయడానికి ఇదే సరైన సమయం. అయితే ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకేనని తెలుస్తోంది. వీటిని అందిపుచ్చుకోవాలంటే ముందుగానే కొనుగోలుకు వెళ్లటం ఉత్తమం. ఇక ఏసీల విషయానికి వస్తే అమెజాన్ ఫెస్టివల్ సేల్ లో ఏకంగా 55 శాతం భారీ తగ్గింపులను అందిస్తోంది. ఒక టన్ను నుంచి 2 టన్నుల వరకు ఉండే వివిధ మోడళ్లపై వీటిని రానున్న వేసవి కోసం ముందుగానే కొనుక్కోవాలనుకునేవారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు.

ఇక సేల్‌లో కిచెన్ చిమ్నీలు గరిష్ఠంగా 62 శాతం తగ్గింపు ధరలకు లభించనున్నాయి. వాల్-మౌంటెడ్, ఐలాండ్ లేదా ఆటో-క్లీన్ చిమ్నీ మోడళ్లపై ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. డిష్‌వాషర్‌లపై గరిష్టంగా 44% తగ్గింపుతో అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2024లో టీవీలపై గరిష్టంగా 66% తగ్గింపుతో 4K అల్ట్రా HD TV, స్మార్ట్ LED TV మోడళ్లపై అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో ల్యాప్‌టాప్‌లపై గరిష్టంగా 39% తగ్గింపుతో అద్భుతమైన డీల్‌లను అందుబాటులో తీసుకొస్తోంది. ఫెస్టివల్ సేల్ సమయంలో స్మార్ట్‌వాచ్‌లపై 93% వరకు అసాధారణ పొదుపులను అన్‌లాక్ చేయండి.

What's Your Reaction?

like
0
dislike
0
love
1
funny
0
angry
0
sad
0
wow
0